టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. పద్మభూషణ్ అవార్డ్ అందుకున్న అనంతరం బాలకృష్ణ జాతీయ మీడియాతో మాట్లాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనకి ఈ పురస్కారం అందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. ఈ సందర్భంగా తాను ఎన్టీఆర్ బిడ్డనని, ఇంటి పేరు నందమూరి అని చాలా వినయంగా పరిచయం చేసుకున్నారు. ఇక తెలుగు చిత్రపరిశ్రమలో తనది 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అని చెప్పిన ఆయన.. తనకు డైరెక్ట్ హిందీ సినిమా చేయాలనే కోరిక ఉందని తెలిపారు. కాగా బాలయ్య త్వరలో ‘అఖండ 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























