యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేశారు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కిష్కింధపురి అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈరోజు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ వీడియో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేన్నో వెతుక్కుంటూ ఓ పాడుబడ్డ బంగ్లా లోకి హీరో, హీరోయిన్ వెళ్లడం అక్కడా వాళ్లకు ఎదురయ్యే పరిస్థులు అలాగే చివర్లో సాయి శ్రీనివాస్ ను దయ్యం గా చూపించడం ఇవ్వని ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,విజువల్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.ఓవరాల్ గా గ్లింప్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాకు బజ్ తీసుకొచ్చింది.
కిష్కింధపురిలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా సామ్ సీఎస్ , చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.ద్వితీయార్థంలో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈసినిమా కాకుండా సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు ,భైరవం అలాగే హైందవ సినిమాలు కూడా చేస్తున్నాడు.టైసన్ నాయుడుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.భైరవం షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.సాయి శ్రీనివాస్ తోపాటు మంచు మనోజ్ ,నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు.ఇక హైందవ డిఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తుంది.లుధిర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తుండగా అకల్ట్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























