హిట్ 3కి సెన్సేషనల్ బుకింగ్స్

Sensational advance booking for Hit 3

నేచురల్ స్టార్ నాని హిట్ 3 అడ్వాన్స్ బుకింగ్ విషయంలో దుమ్ము రేపుతుంది.రోజు రోజుకి సినిమాకు బజ్ పెరుగుతుండడం తో ఎక్స్ లెంట్ బుకింగ్స్ అవుతున్నాయి.ఇప్పటివరకు బుక్ మై షో లో 80 వేలకు పైగా టికెట్లు తెగాయి.యూఎస్ఏ లోనూ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.ఇప్పటివరకు అక్కడ 300K డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఓవరాల్ గా 6 కోట్ల ప్రీ సేల్స్ జరిగాయి.ఏ రేటెడ్ సినిమా అయినా ఆ ప్రభావం ఎక్కడా లేదు.ట్రెండ్ చూస్తుంటే తొలి రోజు దసరా ఓపెనింగ్స్ ను క్రాస్ చేయనుంది హిట్ 3.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొత్తానికి నాని చేసిన ప్రమోషన్స్ సినిమాకు బాగా ఉపయోగపడింది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి తోకలిసి అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేశాడు.దాని ఫలితంగా భారీ ఓపెనింగ్స్ రానున్నాయి.తెలుగు తరువాత తమిళం లో హిట్ 3కి మంచి బజ్ వుంది.అయితే అక్కడ సూర్య రెట్రో రూపంలో భారీ పోటీ ఎదురుకానుంది.ఇక నాని ఎప్పటినుండో సాలిడ్ పాన్ ఇండియా కోసం ఎదురుచూస్తున్నాడు.హిట్ 3తో ఆ కల నెరవేరేలానే వుంది.

నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తున్న ఈసినిమాను శైలేష్ కొలను తెరకెక్కించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు. ఇక గత రెండేళ్ల నుండి హీరోగా అలాగే నిర్మాతగా వరస సక్సెస్ లను చూస్తున్నాడు నాని.మరి ఈ హిట్ 3తో తన సూపర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.