అక్కినేని నాగ చైతన్య 24 వ సినిమా షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.ఇక అందుకు సంబంధించిన వీడియో ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు మేకర్స్. ఈవీడియో ఇంట్రెస్టింగ్ గా వుంది.భారీ సెట్ లు భారీ విఎఫ్ఎక్స్ తో ఈసినిమా రానుందని ఈ వీడియో ద్వారా చెప్పారు..కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు ఎన్నడూ చూడని విజువల్స్ తో ఈ మైథికల్ థ్రిల్లర్ రానుంది.చైతన్య ఈజోనర్ లో సినిమా చేయడం ఇదే మొదటి సారి.ఇందులో తను స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఓవరాల్ గా సినిమా స్టార్ట్ అయిన దగ్గరినుండే ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది చిత్ర యూనిట్.
విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా కోసం ఓ టైటిల్ కూడా ప్రచారంలో వుంది. విరూపాక్ష లాగే ఈసినిమా టైటిల్ కూడా వి అనే అక్షరంతో స్టార్ట్ కానుంది.త్వరలోనే ఈ టైటిల్ ను రివీల్ చేయనున్నారు.ఎస్విసీసీ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక రీసెంట్ గా తండేల్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు నాగ చైతన్య.అంతేకాదు ఈసినిమాతో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.మరి 24వ సినిమాతో తండేల్ కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























