నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా హిట్ 3 మే 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను .అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో డీవోపీ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన కృష్ణ అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు సంతాపం తెలిజేస్తున్నాను. నా విజన్ ని నమ్మి ఈ సినిమాలో పార్ట్ అయిన నటీనటులకు సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
“ఆర్ డైరెక్టర్ నాగేంద్ర గారు వండర్ఫుల్ వరల్డ్ క్రియేట్ చేశారు. షాను గారు ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. మిక్కి జే మేయర్ బ్రిలియంట్ బిజిఎం, మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పార్ట్ అయినా శ్రీనిధి శెట్టి థాంక్యూ. నాని గారు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా మీద ఆయనకున్న పాషన్ అద్భుతం. ఈ సినిమా షూటింగ్లో ఫైర్ నాని గారి హెయిర్‌కి అంటుకుంది. వెంటనే యూనిట్ వెళ్లి ఆపింది.”
“ఇంక షూటింగ్ ఉండదనుకున్నాను. ఆయన నెక్స్ట్ షాట్‌కి రెడీ అయిపోయారు. అదే రోజు షూటింగ్లో ఆయన తలకి గాయం అయింది. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత మిగిలిన సీన్స్ అన్ని ఫినిష్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ షూటింగ్‌కి వచ్చేసారు. సినిమా మీద ఆయనకున్న మ్యాడ్ పేషన్ వండర్ ఫుల్. నాని గారు పక్కన ఉంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నన్ను ఇంత బలంగా నమ్మిన నాని గారికి థాంక్యూ. మే ఒకటి నా సినిమా రిలీజ్ అవుతుంది. ఇది చాలా హానెస్ట్ ఫిలిం. వైలెంట్‌గా ఉంటుంది. సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























