ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీతా ఆర్ట్స్, కల్యా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే నెలలో థియేటర్లోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు సహా ఇతర ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సింగిల్ థియేట్రికల్ ట్రైలర్ రిలిజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్‌గా ఉంది. చూస్తుంటే ఈసారి శ్రీవిష్ణు గట్టిగా కొట్టేలావున్నాడు.
ఇక ఇదిలావుంటే, శ్రీ విష్ణు చాలారోజుల తర్వాత వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. సింగిల్ సినిమాతో పాటుగా మరో 3 సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే ఎస్ఎస్సి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. మారుతీ రావు తెరకెక్కిస్తుండగా సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. ఇవికాకుండా, ‘మృత్యంజయ్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ‘సామజవరగమన’ తరువాత శ్రీ విష్ణు, రెబ్బా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తున్న ఏ సినిమాకి హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తుండగా, కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























