నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా హిట్ 3 మే 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “తెలుగులో ఇది నా ఫస్ట్ సినిమా. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శైలేష్ గారు ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. నేను కాలేజ్ డేస్‌లో నాని గారి సినిమాలన్నీ చూశాను. ఆయనతో వర్క్ చేయాలని ఉండేది. ఈ సినిమా ద్వారా ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా వుంది. నాని గారు ప్రతిరోజు తనని రీఇన్వెంట్ చేసుకుంటారు. ఆయనతో కలిసి నటించడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్” అని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజమౌళి గారిని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కేజీఎఫ్ ఆడియో ఫంక్షన్ కి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. మళ్లీ ఇప్పుడు హిట్ 3 రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కూడా ‘కేజీఎఫ్’లా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. అందరూ థియేటర్స్‌కి వచ్చి ఎంజాయ్ చేయండి” అని కోరారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























