హీరో నానికి స్పెషల్ గిఫ్ట్ అందించిన తమిళ్ ఫ్యాన్స్

Natural Star Nani Receives Shirt as Gift From Tamil Nadu Fans

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా హీరో నాని దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ నగరాలలో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన తాజాగా చెన్నైలో హిట్ 3 ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు అభిమానులు ఆయనకు ఓ షర్ట్‌ను గిఫ్ట్‌గా అందించారు. దీంతో వారి చర్యకు ఎంతో ఆనందించిన నాని వెంటనే దానిని ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక హిట్ 3 చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ చేస్తుండగా.. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేశారు. మలయాళ వెర్షన్ రైట్స్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ దక్కించుకుంది. ఇక ఇప్పటికే యూస్ఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ 115K మార్క్ క్రాస్ చేశాయి. కాగా హిట్: ది 3rd కేస్ మే 1న థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.