ధనుష్ ఇడ్లీ కడాయి షూటింగ్ కంప్లీట్

Idly Kadai Shoot Wrapped up

తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇడ్లీ కడాయి.ఇందులో ధనుష్ నటించడమే కాదు నిర్మాతకూడా వ్యవహరిస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అయ్యింది.బ్యాంకాక్ ,థాయిలాండ్ ల లో ఫైనల్ షెడ్యూల్ జరిగింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అక్టోబర్ 1న ఈసినిమా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హీరోగా ధనుష్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు.అందులో కుబేర ఒకటి.తెలుగు ,తమిళంతో తెరక్కుతున్న ఈసినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా జూన్ 20న రిలీజ్ కానుంది.

వీటితోపాటు ధనుష్ ప్రస్తుతం అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తన 55వ సినిమా చేస్తుండగా హిందీలో తేరే ఇష్క్ మేలో నటిస్తున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తుండగా కృతి సనన్ హీరోయిన్ గా చేస్తుంది.ఇవే కాకుండా ధనుష్ లైనప్ లో చాలా సినిమాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.