నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సెన్సార్ కూడా కంప్లీట్ కాగా వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.అయితే దింతో సంబంధం లేకుండా బుకింగ్స్ లో మాత్రం అదరగొడుతుంది.హైదరాబాద్ లో లిమిటెడ్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి రోజు షోస్ అన్ని ఫుల్ చూపిస్తున్నాయి. బుక్ మై షో లో గత 24 గంటల్లో 13వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.అటు ఓవర్సీస్ లోను సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.హిట్ టాక్ వస్తే నాని కెరీర్ లోనే హిట్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని కూడా సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు.అందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఇక రేపు హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. దీనికి టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి రానున్నాడని సమాచారం.
నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తున్న ఈసినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.ఇక వరుస విజయాలతో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు నాని.కేవలం హీరోగానే కాదు నిర్మాతగా కూడా వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు.రీసెంట్ గా కోర్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు నాని.మరి హిట్ 3 తో ఆ మ్యాజిక్ ను కంటిన్యూ చేస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























