ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమా షూర్ షాట్ హిట్ అనేలా ఉంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మే 9న సింగిల్ థియేటర్లలోకి రానుంది. నిజానికి అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రావాల్సివుంది. అయితే అనుకున్న టైంకి పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. దాంతో సింగిల్ ఆ డేట్ ను లాక్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు మేకర్స్.గతంలో బ్లాక్ బస్టర్స్ అయిన మరో చరిత్ర , గ్యాంగ్ లీడర్ ,జగదేకవీరుడు అతిలోక సుందరి మే 9కే వచ్చాయని గుర్తుచేస్తూ అదే డేట్ ను లాక్ చేస్తున్నామని వీడియో ద్వారా చెప్పారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సింగిల్ లో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటిస్తుండగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ ,కల్యా ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి.
ఇక శ్రీ విష్ణు ఈసినిమా కాకుండా ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేస్తున్నాడు.ఇందులో దాదాపు అన్ని కొత్త డైరెక్టర్స్ తోనే వున్నాయి. మరి ఈసినిమాలు శ్రీ విష్ణుకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: