బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జాట్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై తొలినుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ హిందీ చిత్రం ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రైతులు ఎదుర్కొనే సమస్యలతో రూపొందిన జాట్ సినిమా నార్త్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. తాజగా అందిన సమాచారం ప్రకారం, జాట్ ప్రపంచ వ్యాప్తంగా 110.86 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన 5వ హిందీ సినిమాగా జాట్ రికార్డు సృష్టించింది. ఇక ఈ జాబితాలో 800 కోట్లతో ‘ఛావా’ మొదటి స్థానంలో నిలవగా.. 700 కోట్లతో ‘స్త్రీ 2’ రెండో స్థానంలో ఉంది. అలాగే 176 కోట్లతో సల్మాన్ ఖాన్ ‘సికందర్’, 168 కోట్లతో ‘స్కై ఫోర్స్’ చిత్రాలు తరువాతి స్థానాల్లో వున్నాయి.
ఇక రీసెంట్ గానే మేకర్స్ జాట్ సినిమాకి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు. ఇదే కాంబోలో జాట్ 2 రానున్నట్టు తెలిపారు. కాగా జాట్ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందించగా.. రిషి పంజాబి సినిమాటోగ్రఫర్‌గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.
కాగా ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటించగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్ పాత్రను పోషించాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ మరో కీలక పాత్రలో కనిపించగా.. స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: