‘దేవర’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ మచ్ అవైటెడ్ మూవీని ‘ఎన్టీఆర్-నీల్’ (వర్కింగ్ టైటిల్) అని వ్యవహరిస్తున్నారు. కలకత్తా నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్‌గా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. హీరో ఎన్టీఆర్ లేకుండానే ఈ షెడ్యూల్ జరిగింది. ఈ నేపథ్యంలో నేటినుండి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాగా.. ఇందులో తారక్ జాయిన్ అయ్యాడు. కర్ణాటకలో జరుగనున్న ఈ షెడ్యూల్ దాదాపు మూడు వారాలపాటు ఏకధాటిగా సాగనుంది. ఎన్టీఆర్ పైన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు.
కాగా ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. అయితే దీనిని చిత్ర యూనిట్ ఖరారు చేయాల్సివుంది. అలాగే ఈ మూవీలో నటించనున్న హీరోయిన్‌ను కూడా ఫిక్స్ చేయాల్సివుంది. ప్రశాంత్ నీల్ దాదాపు అన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చే రవి బస్రూర్ దీనికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇక ఇదిలావుంటే, ఎన్టీఆర్ మరోవైపు ‘వార్ 2’ మూవీతో త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు. దీనిని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: