ప్రపంచవ్యాప్తంగా సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డులలో మరో కొత్త కేటగిరీ రాబోతుంది. ఇకపై కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో నిర్మించిన చిత్రాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు తాజాగా అకాడమీ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఏఐ మూవీస్ ఇతర సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపవని, సాధారణ చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే 2026 ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించిన వివరాలను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించింది. కాగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చి 15న అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో గల డాల్బీ థియేటర్లో జరగనుండగా… ఈసారి అకాడమీ కొన్ని నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం.. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు అవార్డుల కోసం పోటీపడనున్నాయి.
2026 ఆస్కార్ నామినేషన్ జాబితాను జనవరి 22న వెల్లడించనున్నారు. నామినేట్ అయిన ప్రతి చిత్రాన్ని అకాడమీ సభ్యులు తప్పనిసరిగా చూడాలి. కొత్తగా ‘అచీవ్మెంట్ ఇన్ కాస్టింగ్’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ విభాగంలో రెండు దశల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగనుండగా.. ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్ డైరెక్టర్లకు పలు రౌండ్ల టెస్టింగ్ ఉంటుంది. ఇక మ్యూజిక్ విభాగంలో నామినేషన్ గడువును 2025 అక్టోబర్ 15గా నిర్ణయించడం గమనార్హం.
ఇక ఇటీవలే ‘స్టంట్ డిజైన్’ అనే కేటగిరీలో కూడా అవార్డులు ఇవ్వనున్నట్టు అకాడమీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడే అమలులోకి రావడం లేదు. 2028లో జరుగనున్న 100వ ఆస్కార్ అవార్డులలో ఈ కేటగిరీని ప్రవేశపెట్టనున్నారు. 2027లో విడుదల కానున్న సినిమాలను ఈ కేటగిరీ కింద నామినేషన్లలో చోటు కల్పించి స్క్రీనింగ్ అనంతరం ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. దీనిపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























