గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ చరణ్ క్రేజ్‌తో థియేటర్లలో సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లోనూ ఆడియెన్స్‌ని అలరించింది. ఈ నేపథ్యంలో ఇపుడు గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి సిద్ధం అయ్యింది. ఈ మూవీ శాటిలైట్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ ఏప్రిల్ 27వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ మేరకు తాజాగా ఆ ఛానెల్ అధికారికంగా వెల్లడించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: