వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా యాక్టర్ సునీల్ మాట్లాడుతూ.. “ముందుగా నేను డైరెక్టర్ అధిక్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయనే నా ఫస్ట్ తమిళ్ సినిమా మార్క్ ఆంటోనీ లో ఛాన్స్ ఇచ్చారు. ఆయన ఏం చెప్తే అది చేశాను. ఆయన టైమింగ్ తోనే యాక్ట్ చేశాను. ఈ సినిమాని ఆయన చాలా డిఫరెంట్ గా తీశారు. అజిత్ గారి సినిమాలన్నీటికి సీక్వెల్ లా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ కి పర్ఫెక్ట్ డైరెక్టర్ అధిక్. ఆయన డైరెక్షన్ చాలా స్పీడ్ గా ఉంటది. ఫస్ట్ టైం తమిళ్లో సినిమా చేసి మంచి హిట్ కొట్టిన మైత్రి మూవీ మేకర్స్ కి కంగ్రాట్స్.”
“ఇలానే అన్ని భాషల్లో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అజిత్ సింపుల్ సిటీ హైయెస్ట్ గ్రేడ్ లో ఉన్న మనిషి అజిత్ గారు. ఆయన ఎనర్జీ అద్భుతం. ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన్ని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏరకంగా పూనకాల్లోకి వెళ్లిపోయారో ఈరోజు అజిత్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: