నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అర్జున్ S/O వైజయంతి టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. “మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో తల్లి కొడుకు పాత్రల మధ్య జరిగే యుద్ధం రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఒక మంచి సినిమా చేయమని నా అభిమానులు అడుగుతున్నారు.”
“సరిలేరు నీకెవరు చేశాను కానీ ఇంకా మంచి పాత్ర చేయమని అడిగారు. అలాంటి మంచి పాత్ర ఎలా వస్తుంది అని భావిస్తున్న తరుణంలో డైరెక్టర్ ప్రదీప్ గారు వచ్చి ఈ కథ చెప్పారు. చాలా మంచి కథ. అక్కడక్కడ కొన్ని మార్పులు చెప్పాను. డైరెక్టర్ గారు విన్నారు. కళ్యాణ్ రామ్ గారితో వెళ్లి నేను ఈ సినిమా చేస్తానని చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ మొదలైంది.”
“ఈ సినిమా కోసం చాలా నిజాయితీగా పని చేసాం. ప్రతిరోజు ఒక్కొక్క సీన్ చేస్తుంటే మాలో ఉత్సాహం నమ్మకం వచ్చింది. ఈ సినిమా డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫస్ట్ రిపోర్టు మాకు ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మి రాజుగారు చెప్పారు. సెన్సార్ రిపోర్టు కూడా వచ్చింది. ఇద్దరం పోటీ పడి యాక్ట్ చేసామని చెప్పారు “
“ఇంకో పెద్ద హిట్ కొట్టబోతున్నారని పేపర్ లో వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. కచ్చితంగా హిట్టు కొట్టబోతున్నామని ఫిక్స్ అయిపోయాం. తల్లి నిరంతరం తన బిడ్డ కోసం త్యాగం చేస్తూనే ఉంటుంది. ఆరాటపడుతూనే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుంటాడు. అయినప్పటికీ తన బిడ్డ మంచి మార్గంలోకి వస్తాడని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.”
“ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క మహిళకి ఈ సినిమాని మేము డెడికేట్ చేయదల్చుకున్నాం. ఈ సినిమా క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు. రామారావు గారు మహానటుడు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలాంటి రామారావు గారు ఎప్పుడూ మా మనసులో ఉంటారు. ఆయన నుంచి బ్లెస్సింగ్ తీసుకోవడం మా అదృష్టం. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది. తప్పకుండా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను.”
“జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇవాళ అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు. ఎంతో కష్టపడి ఆయన ఆ స్థాయికి వెళ్లారు. అభిమానులు ఇచ్చే ఉత్సాహం మాలో 100 రెట్లు బలాన్ని ఇస్తుంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గారిని చూస్తుంటే రామ,లక్ష్మణుల్లా ఉన్నారు. చూడ ముచ్చటగా ఉన్నారు మీరు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్ గారు సపోర్ట్ వల్ల ఈ సినిమాలో నేను ఇంకా అద్భుతంగా చేయగలిగాను.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: