ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. సోమవారం తెల్లవారుజామున ఆమె తిరుమల ఆలయాన్ని సందర్శించుకున్నారు. కాగా ఇటీవల తమ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం బారినపడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. స్వల్ప గాయాలైన మార్క్ శంకర్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే పవన్ సతీమణి శ్రీ వారికి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో సోమవారం వేకువజామున అన్నా లెజినోవా సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీటీడీ అధికారులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. పిదప అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా క్షేత్ర సంప్రదాయం ప్రకారం మొదట శ్రీభూవరాహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం దగ్గర గల కళ్యాణకట్ట వద్ద ఆమె తలనీలాలు సమర్పించారు. అయితే అన్నా లెజినోవా క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. దీంతో, ఆమె శ్రీవారి ఆలయ సందర్శన సందర్భంగా హిందూ మతాన్ని గౌరవిస్తున్నట్టు టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్‌పై సంతకం చేయడం గమనార్హం. అలాగే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.
ఇక తిరుమల సందర్శన సందర్భంగా అన్నా లెజినోవా నిత్యాన్నదానం ట్రస్ట్ కి భారీ విరాళం అందించారు. ఈ మేరకు ఆమె తిరుమల అధికారులకు రూ.17 లక్షల విరాళం ఇచ్చారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో అన్న ప్రసాదాన్ని స్వీకరించిన అన్నా లెజినోవా.. ఈరోజు (సోమవారం) అన్నదానంలో భాగంగా మధ్యాహ్నం భోజనానికి అయ్యే రూ.17 లక్షల రూపాయలను తన కుమారుడు మార్క శంకర్ పేరిట చెక్కును అందజేశారు.
కాగా మరోవైపు పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి సింగపూర్ నుంచి శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. తన భార్య అన్నా లెజినోవా, కూతురు పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్‌తో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఇక తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని అనంతరం పవన్ ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే తన తనయుడు కోలుకోవాలని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన పార్టీ నేతలు, కుటుంబసభ్యులు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: