మాస్ మహా రాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర నుండి అప్డేట్ వచ్చింది.ఫ్యాన్స్ ఎప్పటినుండో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనీ కోరుకుంటున్నారు. ఇక ఈసినిమా నుండి మొదటి పాట రానుంది.తు మేరా లవర్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 14న రిలీజ్ కానుంది.భాను భోగవరపు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ప్రస్తుతం క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు.దీని తరువాత ఓ చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను మే 9న ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.జులై లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది.వీరిద్దరు కలిసి నటించడం ఇది రెండోసారి.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాతో రవితేజ కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఇక ఈసినిమా తరువాత రవితేజ మరో రెండు సినిమాలకు సైన్ చేశాడని టాక్.అందులో ఓ సినిమాను కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేయనున్నాడు.దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారట.అలాగే మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో రవితేజ సోషియో ఫాంటసీ మూవీ చేయనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: