ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు ఉన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడి కుమారుడి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలంటూ ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ తాజాగా ప్రమాదంబారిన పడిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరుగగా.. ఈ ఘటనలో అతడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రమాదం అనంతరం స్కూల్ యాజమాన్యం మార్క్ శంకర్‌ను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























