పెద్ది ఫస్ట్ షాట్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్

Global Star Ram Charan's PEDDI First Shot, Knocks It Out of The Park

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్, రెండు అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్ల తో హ్యుజ్ బజ్ సృష్టించాయి. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీంతో ‘పెద్ది’ భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీరామ నవమి శుభ సందర్భంగా నిర్మాతలు నిన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ షాట్‌ పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా దీనితోపాటుగా సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్ కానుంది.

పెద్ది గ్లింప్స్‌ హైలైట్స్

పెద్ది కోసం భారీ సంఖ్యలో జనం నినాదాలు చేయడంతో ఫస్ట్ షాట్ ఎక్సయిటింగ్ గా ప్రారంభమవుతుంది. రామ్ చరణ్ పెద్ది పాత్రలో సిగార్ తాగుతూ భుజంపై బ్యాట్‌ తో క్రికెట్ మైదానంలోకి పవర్ ఫుల్ గా అడుగుపెడతారు. అతని ఎంట్రీ ఐకానిక్ గా వుంది. “ఒకటే పని సేసే నాకి… ఒకేనాక బతికే నాకి… ఇంత పెద్ద బతుకెందుకు… ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల… పుడ్తామా యేటి మళ్ళీ… సెప్మి…”అంటూ పెద్ది చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

పరిగెత్తుకుంటూ, విశాలమైన వరి పొలాల గుండా దూకడం, చివరకు క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టడం, క్రీజు నుండి బయటకు అడుగుపెట్టి, బ్యాట్ హ్యాండిల్‌ను నేలకు కొట్టి, బంతిని మైదానం దాటించడం.. గూస్‌బంప్స్‌ తెప్పించింది. మొదటి షాట్ అడ్రినలిన్-చార్జ్డ్ మూమెంట్ అందిస్తుంది.

పొడవాటి జుట్టు, రగ్గడ్ గడ్డం, నోస్ రింగ్‌తో కూడిన రామ్ చరణ్ ఇంటెన్స్ న్యూ లుక్ క్యారెక్టర్ రా నెస్ ని తెలియేస్తోంది. అతని డైలాగ్ డెలివరీ, డిక్షన్, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా వున్నాయి. విజయనగరం మాండలికాన్ని పలికిన విధానం అదిరిపోయింది. ఈ ప్రారంభ సన్నివేశంలోని డైలాగ్స్ పెద్ది పాత్ర లైఫ్ ఫిలాసఫీని తెలియజేస్తోంది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది.

దర్శకుడు బుచ్చి బాబు ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్ ని అత్యద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి షాట్, ప్రతి మూమెంట్ గొప్పగా తీర్చిదిద్దారు. టెక్నికల్, ప్రొడక్షన్ గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకుంది. ఆర్ రత్నవేలు విజువల్స్ బ్రెత్ టేకింగ్ గా వున్నాయి. అకాడమీ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కోర్ మరింత ఇంటెన్సిటీని పెంచింది. ఎనర్జీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.

వరల్డ్ క్లాస్ నిర్మాణ విలువలు రూరల్ సెట్టింగ్ కి ప్రాణం పోసుకుంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ పెద్ది రస్టిక్ ఎసెన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి షార్ఫ్ ఎడిటింగ్ నెరటివ్ ని ఆకర్షణీయంగా మలిచింది. అలాగే బుచ్చిబాబు షార్ఫ్ రైటింగ్, టేకింగ్, నిర్మాణం పరంగా ఉన్నత స్థాయి సాంకేతిక బృందంతో పెద్ది ఫస్ట్ షాట్ టార్గెట్ కొట్టినట్టే.

ముఖ్యంగా రామ్ చరణ్ మాగ్నెటిక్ పెర్ఫార్మెన్స్ మాస్ ని ఆకట్టుకునేలావుంది. ఇది చరణ్ పుట్టినరోజుకు పర్ఫెక్ట్ గా నిలిచే ఈ చిత్రం గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ ని అందిస్తుందని హామీ ఇస్తుంది. కాగా ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.