రివ్యూ: రాబిన్‌హుడ్‌

Robinhood Telugu Movie Review

నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో, తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: కోటి
నిర్మాణం: మైత్రి మూవీ మేకర్స్
నిర్మాత: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్
దర్శకత్వం: వెంకీ కుడుముల

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘భీష్మ’ వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్ ఈరోజు థియేటర్లలో విడుదలయింది.

అయితే రాబిన్‌హుడ్ సినిమా ఎలావుంది? నితిన్ హిట్ అందుకున్నాడా? నితిన్-వెంకీ కుడుముల కాంబో మరోసారి మ్యాజిక్ చేసిందా? క్రికెటర్ డేవిడ్ వార్నర్ పోషించిన పాత్ర ఏంటి? అది సినిమాకి హెల్ప్ అయిందా? కొంచెం గ్యాప్ తర్వాత శ్రీలీల కంబ్యాక్ ఇచ్చిన మూవీ హిట్ అయిందా? రాబిన్‌హుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

అనాథ అయిన రామ్ (నితిన్) ఒక దొంగ. ధనవంతులను దోచుకుని పేదలకు సహాయం చేసే మోడ్రన్ రాబిన్‌హుడ్‌ టైప్. చిన్నతనంలో తన తోటి పిల్లల ఆకలి కష్టాలు చూసి చలించి దొంగగా మారతాడు. అయితే దోచుకోవడానికి రామ్ వేసే ప్లాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. ఇదిలావుంటే, రుద్రకొండ అనే గ్రామంలోని భూమిలో పండే గంజాయికి బాగా డిమాండ్ వుంటుంది.

పరమ క్రూరుడైన విలన్ (దేవదత్త నాగే) ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలనే ధ్యేయంతో దుర్మార్గాలు చేస్తుంటాడు. రుద్రకొండ భూమి గురించి తెలుసుకుని అక్కడి భూములను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియాలోని ‘ఏవీ ఫార్మా’ అధినేత అభినవ వాసుదేవ్ (సిజ్జు), కుమార్తె రీనా (శ్రీలీల) రుద్రకొండకి వస్తుంది.

అసలు రీనా రుద్రకొండకి రావడానికి కారణం ఏంటి? తనతో పాటు రామ్ ఎందుకు అక్కడకి వెళ్లాల్సి వస్తుంది? రీనా ప్రాణాలకు ఎవరి వలన ముప్పు ఏర్పడుతుంది? అభినవ వాసుదేవ్‌కి, దేవదత్త నాగేకి మధ్య సంబంధం ఏంటి? ఆస్ట్రేలియాలో ఉండే డ్రగ్స్ మాఫియా డాన్ డేవిడ్ (డేవిడ్ వార్నర్) పాత్ర ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:-

ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైనింగ్‍ మోడ్‌లో సాగుతుంది. లీడ్ పెయిర్ నితిన్, శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ బావుంది. అలాగే రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్‍తో అలరించారు. ఇక సెకండాఫ్ మూవీ యాక్షన్ వైపు టర్న్ తీసుకుంటుంది. పలు ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు బానే వర్కవుట్ అయ్యాయి. క్లైమాక్స్‌లో సెకండ్ పార్ట్‌కి లీడ్ చేసేలా ఓ హింట్ ఇచ్చాడు దర్శకుడు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. నితిన్ నటనలో ఒక ఈజ్ వుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ కూడా తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ కొంచెం విభిన్నమైన పాత్రను పోషించాడు. ఆయన క్యారెక్టర్ వెరీ బిగ్ మానిప్యులేటర్. చాలా స్మార్ట్ మైండ్, వెరీ స్ట్రీట్ స్మార్ట్‌గా ఉంది. ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్. నితిన్ ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం ఫస్ట్ టైం. అయినా ఈ ఇంటలెక్చువల్ క్యారెక్టర్‌లో నితిన్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఖచ్చితంగా ఇది తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది.

హీరోయిన్ శ్రీలీల పాత్రకు సినిమాలో ఇంపార్టెన్స్ వుంటుంది. తన స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. చాలా గ్లామర్ గా కనిపించింది. కేతిక శర్మ నటించిన స్పెషల్ సాంగ్ అదిదా సర్ప్రైజు యూత్ ని అలరిస్తుంది. అలాగే డేవిడ్ వార్నర్ క్యామియో రోల్‌లో కనిపించి అలరించాడు. ఆయన ఉన్నంతసేపు థియేటర్ సందడిగా మారుతుంది. ఇంకా రాజేంద్రప్రసాద్ పాత్ర సినిమాలో కీలకంగా వుంటుంది. వెన్నెల కిశోర్ ఎప్పటిలానే కితకితలు పెట్టాడు. మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక సినిమా టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్‌లో ఉంది. టెక్నిషియన్స్ విషయానికొస్తే.. సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతోంది. చాలా సీన్స్ కేవలం బీజీఎమ్ తోనే హైలైట్ అయ్యాయి. అలాగే పాటల్లో సైతం తన మ్యాజిక్ చూపించాడు ప్రకాష్ కుమార్.

అలాగే సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది. విజువల్స్, లొకేషన్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. కోటి ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్స్.. అదికూడా ముగ్గురు కలిసి తీసిన చిత్రం కావడంతో నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమా కేవలం యాక్షన్ ప్రియులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. నితిన్-వెంకీ కుడుములు కాంబో మ్యాజిక్ రిపీట్ అయినట్టేనని చెప్పొచ్చు. ఓవరాల్‌గా రాబిన్‌హుడ్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.