రివ్యూ : మ్యాడ్ స్క్వేర్

Mad Square review in telugu

నటీనటులు : నార్నె నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : శామ్ దత్ 
సంగీతం : భీమ్స్ సిసిరోలియో ,తమన్
దర్శకత్వం : కళ్యాణ్ శంకర్
నిర్మాతలు : సూర్యదేవర హారిక ,సాయి సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీడియం బడ్జెట్ సీక్వెల్స్ లో టిల్లు స్క్వేర్ తరువాత ఆ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్. టీజర్ తో ఈసినిమాకు ఒక్కసారిగా హైప్ వచ్చింది. ఫస్ట్ పార్ట్ లో వున్న వాళ్ళతోనే ఈ సీక్వెల్ చేశాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్.ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. మరి మ్యాడ్ స్క్వేర్ ఎలా వుంది ? ఫస్ట్ పార్ట్ ను మ్యాచ్ చేయగలిగి పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించుకుందో లేదో తెలుసుకుందాం.

కథ :
మూడు సంవత్సరాల తరువాత లడ్డు ( విష్ణు ఓయ్ ) పెళ్ళిలో కలుస్తారు మనోజ్ (రామ్ నితిన్) అశోక్ (నార్నె నితిన్),దామోదర్ (సంగీత్).ఈ మ్యాడ్ గ్యాంగ్ రచ్చ రచ్చ చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది.ఆ తరువాత ఈనలుగురు కలిసి గోవా ట్రిప్ కు ప్లాన్ వేస్తారు.ఇక గోవా వెళ్ళాక ఈ గ్యాంగ్ అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు.ఆ తర్వాత అందులోనుండి ఈ గ్యాంగ్ ఎలా బయటపడింది.మ్యాక్స్ (సునీల్) ఈ గ్యాంగ్ ను ఎందుకు వెతుకుతాడు. చివరికి ఏమైంది అనేది మిగితా కథ.

విశ్లేషణ :

కథ ఏమి లేకుండా కేవలం ఎంటర్టైన్ చేయడం కోసం సినిమా ఇదని నాగవంశీ ప్రమోషన్స్ లలో పదే పదే చెప్పుకొచ్చాడు.అలా చెప్పి ఆడియెన్స్ ను ముందే ప్రిపేర్ చేసినా ఎంతో కొంత అంచనాలతోనే థియేటర్ కు వెళ్తారు.అయితే అలా వెళ్లిన వారిని కూడా ఈసినిమా డిస్సపాయింట్ చేయదు.ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ , కామెడీ తోపాటు క్యూట్ లవ్ స్టోరీస్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.ఇందులో మాత్రం కామెడీపై మాత్రమే ఫోకస్ చేశారు.ఓ సాంగ్ కూడా బాగుంది.

ఫస్ట్ హాఫ్ లో లడ్డు పెళ్ళికి మ్యాడ్ గ్యాంగ్ రావడం అందులో వాళ్ళు చేసే అల్లరి తో సరదాగా సాగిపోతుంది.ఈ ఎపిసోడ్ లో లడ్డు , అతని తండ్రి చేసే కామెడీ హైలైట్ అయ్యింది.ఇంటర్వెల్ ముందు గోవా ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది.ఇక సెకండ్ హాఫ్ అంతా గోవా లోనే జరుగుతుంది.ఈ ఎపిసోడ్ కూడా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది.అయితే ఇంకొంచెం బాగా తీయాల్సిందన్న ఫీలింగ్ కలుగక మానదు.

ఇందులో సునీల్ ను తీసుకున్నారు.సునీల్ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది.రన్ టైం తక్కువ ఉండడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.
ఓవరాల్ గా కామెడీ ని బేస్ చేసుకొని యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ ఎంగేజింగ్ గా ఉండి పక్కా టైం పాస్ చేయించడం గ్యారెంటీ.

నటీనటుల విషయానికి వస్తే మ్యాడ్ గ్యాంగ్ నార్నె నితిన్ ,రామ్ నితిన్ , సంగీత్ శోభన్ యాక్టింగ్ తో అదరగొట్టారు.ఫస్ట్ పార్ట్ లో లాగే ఎనర్జిటిక్ యాక్టింగ్ తో మెప్పించారు.సంగీత్ కామెడీ టైమింగ్ బాగుంది.వన్ లైనర్స్ బాగా పేలాయి.మ్యాడ్ లో లడ్డు పాత్ర ప్రత్యేకంగా నిలిచింది.ఇందులోనూ ఈ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ రోల్ లో నటించిన విష్ణు ఓయ్ సూపర్ గా చేశాడు.భాయ్ పాత్రలో సునీల్ నవ్వించాడు.సీనియర్ నటులు రఘుబాబు ,మురళీధర్ గౌడ్ పాత్రలకు న్యాయం చేశారు.హీరోయిన్లు అంటూ ఎవరు లేరు.ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్ చెరో సాంగ్ లో కనిపించారు.

టెక్నికల్ గా సినిమా మెప్పించింది.భీమ్స్ పాటలు ఆకట్టుకొన్నాయి.తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.ఇలాంటి సినిమాలకు ఎలాంటి బీజీఎమ్ కావాలో అదే ఇచ్చాడు.శామ్ దత్ కెమెరా పనితనం బాగుంది.విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి.ఎడిటింగ్ షార్ప్ గా వుంది.తక్కువ రన్ టైం సినిమాకు కలిసొచ్చింది. సూర్యదేవర హారిక ,సాయి సౌజన్య క్వాలిటీతో సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన మ్యాడ్ స్క్వేర్ ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేయలేం కానీ ఫ్రెండ్స్ తమ గ్యాంగ్ తో వెళితే మ్యాడ్ స్క్వేర్ పక్కాగా టైం పాస్ చేయిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.