యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2 గంటల 7నిమిషాల రన్ టైంతో మార్చి 28న థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా భీమ్స్ సిసిరోలియో అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ అయ్యి ‘మ్యాడ్’ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే మ్యాడ్ స్క్వేర్ సినిమాకి భీమ్స్ పాటలకే మ్యూజిక్ అందిస్తుండగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటం విశేషం.
ఇదిలావుంటే, తాజాగా మ్యాడ్ స్క్వేర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మ్యాడ్ మాక్స్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు మేకర్స్. ఈ కార్యక్రమానికి యువ సామ్రాట్ నాగచైతన్య చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: