బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ల తో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్.రీసెంట్ గా డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అంతేకాదు డ్రాగన్ తో వరుసగా రెండో సారి 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యి రికార్డు క్రియేట్ చేశాడు ప్రదీప్.ఇంతకుముందు లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఈసినిమాని తనే డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక డ్రాగన్ తరువాత ప్రదీప్ ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)తో రానున్నాడు.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలచేయాలని చూస్తున్నారు.ఇది కూడా హిట్ అయితే ప్రదీప్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈసినిమాను నిర్మిస్తుంది.
ఇక ప్రదీప్ నెక్స్ట్ సినిమా కూడా మొదలుపెట్టాడు.అందులో భాగంగా కీర్తిశ్వరన్ అనే కొత్త దర్శకుడితో తన నాలుగో సినిమా చేస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.కోలీవుడ్ లో మైత్రికి ఇది రెండో సినిమా.ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి.ఈ సందర్భంగా ఫస్ట్ షాట్ బూమ్ పేరుతో వీడియో రిలీజ్ చేశారు.యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది చివర్లో ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























