రీసెంట్ గా రిలీజైన రెండు తమిళ సినిమాలు డ్రాగన్ ,నీక్ (నిలువుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం) ఈరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.ఒకే రోజు ఈసినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఒకే రోజు ఓటిటిల్లోకి వచ్చాయి.ఇందులో డ్రాగన్ అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రాగ నీక్ మాత్రం కేవలం ఒరిజినల్ వెర్షన్ తమిళం లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చింది.మిగితా భాషల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి వస్తుందో క్లారిటీ రావాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే డ్రాగన్ అదరగొట్టింది.ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అశ్విన్ మరిముత్తు డైరెక్ట్ చేశాడు.యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ గా వచ్చినా ఈసినిమా 100 కోట్ల కుపైగా వసూళ్లను సాధించి ఈఏడాది తమిళంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా రాగా 20 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇందులో కయాదు లోహర్ ,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించగా ఏజియస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఇక నీక్ విషయానికి వస్తే హీరో ధనుష్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చింది.ఈసినిమా కుడా మంచి రివ్యూస్ ను తెచ్చుకున్నా డ్రాగన్ ముందు నిలువలేకపోయింది.తెలుగులో ఈసినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా గా రిలీజ్ అయ్యి సేమ్ రిజల్ట్ ను రిపీట్ చేసింది.
ఇందులో ధనుష్ మేనల్లుడు పవిష్ ,అనికా సురేంద్రన్ లీడ్ రోల్స్ లో నటించగా వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందించగా ధనుష్ నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: