మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన RC 16 అప్డేట్ వచ్చింది.ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈసినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అదిరిపోయింది.ఇందులో చరణ్ రగ్గడ్ లుక్ లో ఊర మాస్ గా కనిపించాడు.ఈసినిమా కోసం చరణ్ బరువు పెరిగాడు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో అది క్లియర్ గా కనిపించింది.ఉగాది పండగ రోజున గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈరోజే గ్లింప్స్ ఇవ్వాలనుకున్నా వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే రెండు రోజుల క్రితమే ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.అతి త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.సెప్టెంబర్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసి కుదిరితే ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























