మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది.చిరుని కలిసి ఈరోజు ఫైనల్ స్క్రిప్ట్ వినిపించారు అనిల్. ఇక స్క్రిప్ట్ ఫుల్ గా నచ్చేయడం తో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఉగాదికి ఈసినిమా లాంచ్ కానుంది.ఇందులో చిరు,శివ శంకర్ ప్రసాద్ రోల్ లో కనిపించనున్నారు. చిరు అసలు పేరు కూడా కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్.ఇకచిరంజీవి నరేషన్ బాగా ఎంజాయ్ చేశారని ఇంకెందుకు లేట్ త్వరలో ముహర్తం అని ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు.మాములుగానే అనిల్ రావిపూడి తన సినిమాలకు ఎక్కువ రోజులు తీసుకోడు.రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ను కేవలం 75రోజుల్లో పూర్తిచేశాడు.చిరుతో చేసే సినిమాకు కూడా ఇదే ఫాలో కానున్నాడు. భీమ్స్ సిసిరోలియో ఈసినిమాకు సంగీతం అందించనుండగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్,షైన్ స్క్రీన్స్ బ్యానర్ల పై చిరంజీవి పెద్ద కూతరు సుష్మిత కొణిదెల ,సాహు గారపాటి నిర్మించనున్నారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాలో వింటేజ్ చిరుని చూపించనున్నారు అనిల్ రావిపూడి.వచ్చే సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది.సంక్రాంతికి వస్తున్నాం తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి నుండి నెక్స్ట్ వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: