బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’ అరుదైన గౌరవం దక్కించుకుంది. మార్చి 27న పార్లమెంట్‌లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండటం విశేషం. అలాగే ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు రానున్నట్టు తెలుస్తోంది. ఇలా పార్లమెంట్‌లో స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకున్న అతికొద్ది చిత్రాలలో ఛావా స్థానం దక్కించుకోవడం గమనార్హం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్ రన్ తో రూ.750 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే కళ్లజూసింది, అల్లు అరవింద్ సారథ్యంలోని గీతా ఆర్ట్స్ దీనిని తెలుగులోకి డబ్ చేసి అందించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను దినేష్ విజన్ గ్రాండ్‌గా నిర్మించాడు.
మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీగా నటించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆయన భార్య యేసుబాయి భోంస్లేగా కనిపించింది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా కీలక పాత్రలు పోషించారు.
కథ:–
ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. మరోవైపు దీనిని కబళించడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఢిల్లీ సుల్తాన్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) ఇదే అనువుగా భావించి మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అతడికి ఊహించని విధంగా ఛత్రపతి శివాజీ తనయుడు, శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్) అడ్డుగా నిలుస్తాడు. శంభాజీ తన యుద్ధ నైపుణ్యంతో మొఘల్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడతాడు.
దీంతో యుద్ధంలో ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో ఔరంగజేబే స్వయంగా కదనరంగంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల మధ్య మరాఠా సామ్రాజ్యంలోని కొందరు దురాశాపరులు శంభాజీకి వెన్నుపోటు పొడుస్తారు. అయితే ఈ రాజద్రోహులు చేసిన ఆ ద్రోహం ఏంటి? శత్రుసైన్యంతో కలిసి శంభాజీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఎవరు? వీరి పన్నాగాలను శంభాజీ మహారాజ్ ఎదుర్కొన్నాడా? లేక బలయ్యాడా? ఆయన తన సామ్రాజ్యాన్ని కాపాడుకోగలిగారా? చివరికి ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: