ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ తో రానున్నాడు.లవ్ చేస్తూనే లవ్ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పక్కా హిట్ అనే టాక్ ను తెచ్చుకుంది.ఇందులో శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఎప్పుడేస్తుందో చెప్పేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే లో సింగిల్ థియేటర్లోకి రానుంది.ఇందులో కేతికా శర్మ ,ఇవానా హీరోయిన్లు గా నటిస్తుండగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.గీతా ఆర్ట్స్ ,కల్యా ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి.
ఇక శ్రీ విష్ణు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.సింగిల్ తో కలిపి శ్రీ విష్ణు చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు వున్నాయి.అందులో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు.షూటింగ్ జరుగుతుంది.జానకి రామ్ మారెళ్ల డైరెక్ట్ చేస్తుండగా బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే శ్రీ విష్ణు ఎస్ఎస్ సి బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు.మారుతీ రావు తెరకెక్కిస్తుండగా సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు.
ఇవికాకుండా శ్రీ విషు, మృత్యంజయ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.సామజవరగమన తరువాత శ్రీ విష్ణు ,రెబ్బా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు.హుస్సేన్ షా కిరణ్ డైరెక్ట్ చేస్తుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: