హిట్ ఫ్రాంచైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తుంది హిట్ 3.ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.ఇందులో నాని, అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో చాలా వైలెంట్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రానుంది.ఈనెల 24న ఈ సాంగ్ ను రిలీజ్ కానుంది.ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈపాటకు ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ అందించాడు.ఈ సాంగ్ చార్ట్ బస్టర్ కానుందని టాక్.ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.మే 1న హిట్ 3 థియేటర్లలోకి రానుంది.
ఈసినిమా తరువాత నాని ది ప్యారడైజ్ చేయనున్నాడు.శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లింప్స్ షాక్ ఇచ్చింది.చాలా బోల్డ్ గా ఈసినిమా తెరకెక్కనుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: