అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. మొదటి చినుకు సాంగ్ రిలీజ్

Modhati Chinuku Lyrical Video Out From Akkada Ammayi Ikkada Abbayi

ప్రముఖ టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ప్రదీప్ తొలి చిత్రం లాగానే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలకు ముందే మ్యూజికల్ హిట్‌గా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ ‘మొదటిటి చినుకు’ సాంగ్ రిలీజ్ చేశారు. రధన్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీ అద్భుతమైన గ్రామీణ నేపథ్యంలో తొలి ప్రేమలోని అమాయకత్వం మ్యాజిక్ అందంగా చిత్రీకరిస్తుంది.

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా వుంది. సిద్ శ్రీరామ్ తన మెస్మరైజింగ్ వోకల్స్ తో ట్రాక్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. ప్రదీప్ దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ ప్రేమకథ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. కొరియోగ్రాఫర్ విశ్వ రఘు వారి ప్రేమకథను బ్యూటీఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చిత్రీకరించారు.

మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, జి ఎం సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎన్ బాలరెడ్డి కెమెరా మ్యాన్‌గా పని చేస్తుండగా.. కోదాటి పవనకల్యాణ్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ అందించగా, ఆశిస్తేజ పులాల ప్రొడక్షన్ డిజైనింగ్ చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.