సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ.. “బ్రహ్మానందం గారికి, మారుతి గారికి, నిర్మాత ఎస్ కే ఎన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ అభిలాష్ గారి బ్లాక్ బస్టర్ జర్నీ ఈ ఫ్రైడే నుంచి స్టార్ట్ కాబోతుంది. మా నిర్మాతలు చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు. సప్తగిరి గారి ఎనర్జీ, ఫ్యాషన్, పాజిటివిటీ అద్భుతం. నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. మార్చి 21న ఈ సినిమాని ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చాలా హార్ట్ ఫుల్ గా ఈ సినిమా తీశాం. మీ అందరినీ అలరిస్తుందని నమ్మకం ఉంది” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: