సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 (వర్కింగ్ టైటిల్).సైలెంట్ గా ఈసినిమా షూటింగ్ ఒడిశా లో స్టార్ట్ కాగా నిన్నటి తో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.షార్ట్ బ్రేక్ తరువాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.మాములుగా సినిమా స్టార్ట్ అయ్యే ముందే అనౌన్స్ మెంట్ వీడియో లతో సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేస్తాడు రాజమౌళి.కానీ ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29కు మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా షూట్ కానిచ్చేస్తున్నాడు.
వచ్చే ఏడాదికల్లా సినిమా షూటింగ్ పూర్తి చేసి 2027లో విడుదలచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మేకర్స్.ఇండియన్ మూవీ హిస్టరీ లో ఇంతకుముందెన్నడూ రాని కథ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సుమారు 1000కోట్ల బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: