నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో 4వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. హీరో నాని ఈ సినిమా ఘనవిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా యాక్టర్ శివాజీ మాట్లాడుతూ.. “25 ఏళ్ళుగా మంగపతి లాంటి క్యారెక్టర్ కోసం ఎదురుచూశాను. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కల వుంటుంది. ఒక రోజు మొత్తం ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలని. అది ఈ సినిమాతో తీరింది. నాని గారు ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయనలానే కొత్త తరహలో దమ్మున్న సినిమాలు చేస్తున్నారు. ఆయన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది దర్శకులు పరిచయమవుతున్నారు.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమాలు చేయాలని కసి నాకూ వుంది. ఆ కసికి సాకారం నాని గారు ఇచ్చారు. ఇకపై సినిమాలు చేస్తాను. ఈ సినిమా గొప్ప ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాలో పని చేసిన అందరూ అద్భుతంగా చేశారు. మంగపతి లాంటి పాత్ర లైఫ్ లో ఒకేసారి వస్తుంది. ఆ కిక్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా జిందాబాద్.. ప్రొడ్యూసర్ జిందాబాద్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: