నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో 4వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రీమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో టీం సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వెర్డిక్ట్ ఈవెంట్ నిర్వహించింది. హీరో నాని ఈ సినిమా ఘనవిజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా సినిమాలో ప్రధానపాత్ర పోషించిన నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. “బలగం హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నపుడు రామ్ జగదీశ్ ఈ కథ చెప్పారు. ఈ కథ విని చాలా గొప్పగా ఫీలయ్యాను. మాకు సపోర్ట్ గా దీప్తి అక్క, ప్రశాంతి గారు వచ్చారు. మేమంతా రాకెట్ లో కూర్చుంటే మమ్మల్ని చుక్కల దాక తీసుకెళ్ళారు. ఆయన నమ్మకపోయుంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు, ఈ సినిమా.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇందులోని మంగపతి పాత్ర గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. శివాజీ అన్న మాకు గొప్ప స్ఫూర్తి ఇచ్చారు. ఈ సినిమాలో నాతో పాటు నటించిన అందరికీ థాంక్ యూ. రోహిణీ గారు, శుభలేఖ సుధాకర్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. విజయ్ వరల్డ్ క్లాస్ సౌండ్ ఇచ్చారు. దినేష్ ఈ సినిమాకి వెలుగు తీసుకొచ్చారు. విట్టల్ తన కోర్ట్ సెట్ కి జీవం పోశారు. కార్తిక్ అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. తెలుగు ప్రేక్షకులు జాతిరత్నాలు. థాంక్ యూ సో మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: