నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రీ-టీజర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన అర్జున్ S/O వైజయంతి’ ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులపై కాల్పులు జరపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. చావుకి ఎదురెళ్ళిన ప్రతిసారి ఆమెకు కొడుకు అర్జున్ ముఖం గుర్తుకు వస్తుంది. వైజాగ్‌లో నేరస్థులని నియంత్రించడంలో పోలీసులు, కోర్టులు రెండూ విఫలమైనప్పుడు, అర్జున్ పరిస్థితని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సీన్స్ స్టోరీలోని ఇంటెన్సిటీని తెలియజేసేలా వున్నాయి.
రేపటినుంచి వైజాగ్‌ని పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి” అంటి హీరో కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ విజిల్స్ వేయించేలా వుంది. అలాగే “నేను డ్యూటీలో ఉన్నా, లేకున్నా.. సచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా.. నా కళ్ళముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తేలేదు” అంటూ విజయశాంతి పలికిన డైలాగ్ టీజర్‌కే హైలైట్.
చట్టాన్ని ధిక్కరించే ఎవరినీ శిక్షించకుండా ఉండనివ్వనని విజయశాంతి చెప్పడం, అర్జున్ అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పడంతో టీజర్ ఎండ్ అవ్వడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. అర్జున్ S/O వైజయంతిలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి యాక్షన్, డ్రామా, భావోద్వేగాలను అద్భుతంగా బ్లెండ్ చేశాడు. మదర్ డ్యూటీ, కొడుకు కోపం, మంచి, చెడుల మధ్య ఒక ఎపిక్ స్టొరీగా ప్రెజంట్ చేశాడు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు తన మోస్ట్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అందించాడు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టాడు. విజయశాంతి కంబ్యాక్ గొప్పగా వుంది. ఆమె తన పాత్ర ఇంటెన్స్‌ను, తల్లి యొక్క లోతైన భావోద్వేగాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. వారి కెమిస్ట్రీ నెరేటివ్‌కి డెప్త్ అండ్ ఇంపాక్ట్‌ని యాడ్ చేస్తోంది.
ఈ టీజర్ ఈ రెండు ప్రధాన పాత్రల స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని ప్రెజెంట్ చేసింది. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దీంతో మూవీ లవర్స్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇందులో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమా బ్యాక్ డ్రాప్‌ని హైలైట్ చేస్తుంది. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ పవర్ ఫుల్ నేపథ్య సంగీతంతో కథనాన్ని మరింతగా పెంచారు. తమ్మిరాజు ఎడిటర్, స్క్రీన్‌ప్లేను శ్రీకాంత్ విస్సా అందించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ కనిపించింది. మొత్తంమీద, టీజర్ వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: