బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా వుంది.అల్లరి నరేష్ మరోసారి కొత్త జోనర్ లో సినిమా చేస్తున్నాడు.ఇందులో తను డిఫరెంట్ రోల్ లో కనిపించనుండగా పొలిమేర సిరీస్ ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు.సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫీక్ ఫామ్ లో వున్న భీమ్స్ సిసిరోలియో ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ సమ్మర్ లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.మరి ఈసినిమా తో అల్లరి నరేష్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: