గోపీచంద్ 33 షురూ.. డైరెక్టర్ ఎవరంటే?

Macho Star Gopichand Joins Hands With Director Sankalp Reddy For Gopichand33

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఒక ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్‌కి కోర్ టీం, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

IB 71 (స్కై బ్యాక్ డ్రాప్), ఘాజీ (వాటర్ బ్యాక్ డ్రాప్) అంతరిక్షం (స్పెస్ బ్యాక్ ట్రాప్) చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పుడు సరికొత్త టెరిటరీలోకి అడుగుపెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఫైర్ ఎలిమెంట్‌ని క్రియేటివ్‌గా ఎక్స్‌ఫ్లోర్ చేయనున్నారు. భారతీయ చరిత్రలో కీలకమైన, మరచిపోయిన సంఘటన విజువల్ వండర్‌గా ప్రజెంట్ చేయనున్నారు.

ఇక ఈ చిత్రంలో గోపీచంద్‌ నెవర్ బిఫోర్ రోల్‌లో కనిపించనున్నారు. ఇది ఆయన వెర్సటాలిటీని హైలెట్ చేస్తుంది. 7వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా, ఒక ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని చారిత్రక సంఘటనని ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకొస్తోంది. భారతీయ వారసత్వ మరచిపోయిన అధ్యాయానానికి జీవం పోస్తుంది.

కాగా ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. HIT 1, HIT 2, గీత గోవిందం, సైంధవ్ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన మణికంధన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. అద్భుతమైన ప్రతిభావంతులైన కోర్ టీమ్‌, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.