డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో పవర్ ఫుల్ రోల్ చేస్తుంది.ఇక ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.పోస్టర్ లో కళ్యాణ్ రామ్ వెనకాల పోలీస్ డ్రెస్ లో విజయశాంతి కనిపించారు.ఈసినిమాలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనుండగా కళ్యాణ్ రామ్, విజయ శాంతి కొడుకుగా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది ఈసినిమాను ఎంత క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారోనని.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.సినిమా కూడా బాగా వస్తుందని టాక్ వినిపిస్తుంది.బింబిసార తరువాత అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో కళ్యాణ్ రామ్ కు సాలిడ్ హిట్ పడనుంది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ రాజ్,సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.కుదిరితే మే లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























