నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కంబినేషన్ లో రానున్న రెండో సినిమా ది ప్యారడైజ్.ఇంతకుముందు ఇదే కాంబోలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దాంతో ది ప్యారడైజ్ పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి.ఇక రీసెంట్ గా ది ప్యారడైజ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు.రా &బోల్డ్ గా ఈసినిమా రానుంది.గ్లింప్స్ లోని డైలాగ్స్ , నాని లుక్ ,టాటూ గురించి చాలా చర్చ జరిగింది.మొదట్లో ఇదేంటి ఇలా ఉందన్నవాళ్ళు తరువాత పొగిడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం గ్లింప్స్ ద్వారానే సూపర్ హైప్ ను క్రియేట్ చేశారు.ఇక ఈసినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.1950-1983 లో సికింద్రాబాద్ లో వుండే ఓ తెగ గురించి ఈసినిమా.అందులో నుండి పుట్టిన ఒకడు నాయకుడై వాళ్ల హక్కుల గురించి పోరాడి వారికి ఎలా గుర్తింపు తెచ్చాడు అనేదే ఈసినిమా కథ.ఈకథ ను శ్రీకాంత్ చాలా అతెంటిక్ గా చెప్పనున్నాడు.నాని అయితే ఈసినిమా ఇండియన్ మ్యాడ్ మ్యాక్స్ అవుతందని అంటున్నాడు.విడుదల రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకొనేలానే వుంది. ఓవరాల్ గా నాని కెరీర్ లోనే ది ప్యారడైజ్ ప్రత్యేకమైన సినిమా కానుంది.
ఏప్రిల్ లేదా మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: