రివ్యూ: ఛావా

Chhaava Review in Telugu

నటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, డయానా పెంటీ, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్ర‌ఫీ: సౌరభ్ గోస్వామి
ఎడిటింగ్: మనీష్ ప్రధన్
నిర్మాణం: మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌
సమర్పణ: గీతా ఆర్ట్స్
నిర్మాత: దినేష్‌ విజన్‌
దర్శకత్వం: లక్ష్మణ్‌ ఉటేకర్‌

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధానపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా రూపొందింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న విక్కీ కౌశల్ జోడీగా నటించింది. సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ప్రతినాయకుడు ఔరంగజేబ్ పాత్రలో కనిపించాడు.

విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ‘ఛావా’ ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలి ఆటనుంచే అద్భుతమైన టాక్ సొంతం చేసుకుని ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు దాదాపు 700కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పటికే తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది.

ఈ క్రమంలో నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 550కి పైగా థియేటర్లలో భారీ రిలీజ్ అయింది. అయితే తొలినుంచీ ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తున్న విక్కీ కౌశల్ ఈసారి మరాఠా యోధుడిగా చారిత్రాత్మక పాత్రలో ఎలా నటించాడు? మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? వందల సంవత్సరాలక్రితం ఏం జరిగింది? దానిని ఎంతమేరకు తెరపైన ఆవిష్కరించగలిగారు? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.

కథ:

ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. మరోవైపు దీనిని కబళించడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఢిల్లీ సుల్తాన్, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) ఇదే అనువుగా భావించి మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాడు.

అయితే, అతడికి ఊహించని విధంగా ఛత్రపతి శివాజీ తనయుడు, శంభాజీ మహారాజ్(విక్కీ కౌశల్) అడ్డుగా నిలుస్తాడు. శంభాజీ తన యుద్ధ నైపుణ్యంతో మొఘల్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడతాడు. దీంతో యుద్ధంలో ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో ఔరంగజేబే స్వయంగా కదనరంగంలోకి అడుగుపెడతాడు.

ఈ పరిణామాల మధ్య మరాఠా సామ్రాజ్యంలోని కొందరు దురాశాపరులు శంభాజీకి వెన్నుపోటు పొడుస్తారు. అయితే ఈ రాజద్రోహులు చేసిన ఆ ద్రోహం ఏంటి? శత్రుసైన్యంతో కలిసి శంభాజీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు ఎవరు? వీరి పన్నాగాలను శంభాజీ మహారాజ్ ఎదుర్కొన్నాడా? లేక బలయ్యాడా? ఆయన తన సామ్రాజ్యాన్ని కాపాడుకోగలిగారా? చివరికి ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:-

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని చాలా నిజాయితీగా తెరకెక్కించాడు. ఇలాంటి చారిత్రిక పాత్రలతో సినిమా చేసేటప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. ఈ విషయంలో లక్ష్మణ్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ మూవీపై బయటినుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అందరికీ తెలిసిన కథే అయినా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసాడు.

సినిమాలో శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. శివాజీ మహారాజ్ వాయిస్ ఓవర్‌ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కథలో బలమైన పాత్రలు చాలా ఉన్నాయి. దీంతో ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయా పాత్రల ఇంట్రడక్షన్ సీన్లతో కొంచెం స్లో గా నడిచిన ఫీలింగ్ కలుగుతుంది. ఒక మంచి ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

అయితే ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌ ప్రారంభమవుతుందో అక్కడినుంచి కథ పరుగులు పెడుతుంది. ముఖ్యంగా వార్ సీన్స్‌ ఆడియెన్స్‌కి గూంజ్ బంప్స్ తెప్పిస్తాయి. సొంతవారే కథానాయకుడికి వెన్నుపోటు పొడిచే సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. అలాగే క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథలో ఎమోషన్‌ తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో వచ్చే డైలాగ్స్ కానీ, విక్కీ నటన కానీ సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు తమనితాము మర్చిపోయేలా చేస్తాయి. అద్భుతమైన ముగింపు ఆడియెన్స్‌ని కుదిపేస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. గతంలో ‘ఉరి’ వంటి దేశభక్తి చిత్రంలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్ మరోసారి అలాంటి ఛాలెంజింగ్ పాత్రను పోషించాడు. ఇందులో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నభూతో.. అన్నట్టుగా జీవించేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తుంది. సినిమాలో విక్కీ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అద్భుతం అని చెప్పాలి.

అలాగే రష్మిక మందన్న పాత్రకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉంది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటన భయపెడుతుంది. చాలారోజుల తర్వాత అయన క్రూరమైన చక్రవర్తిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇంకా అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటీ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్ గా నటించారు.

ఇక టెక్నిక‌ల్‌ విషయానికొస్తే.. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ రెహమాన్ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. అలాగే మనీష్ ప్రధన్ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. ఇంకా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా చూస్తే, ఛావా ఒక మంచి హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్, డైరెక్టర్ విజన్ కలగలిసి సినిమాను అద్భుతంగా మలిచింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్‌ జీవితచరిత్రలు తెలుసుకోవాలనుకునే ప్రతిఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు. మొత్తానికి ఛావా ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.