యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈసినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం లో వుంది.అయితే ఇదే టైటిల్ తో రీసెంట్ గా తమిళంలో డ్రాగన్ అనే సినిమా వచ్చింది.ఈసినిమా 100కోట్ల మార్క్ ను చేరుకుంది.తెలుగులో ఈ సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ విడుదలచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్ నీల్ మూవీని కూడా మైత్రినే నిర్మిస్తుంది.ఇక డ్రాగన్ తెలుగు ప్రమోషన్ లో భాగంగా మైత్రి నిర్మాత రవిశంకర్ ను డ్రాగన్ టైటిల్ వాడేశారు కదా ఎన్టీఆర్ నీల్ టైటిల్ మారుస్తారా అని ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు.ఎన్టీఆర్ నీల్ సినిమాకు ఈ డ్రాగన్ తో సంబందం లేదు.అది చాలా పెద్ద సినిమా.యూనిక్ స్క్రిప్ట్ తో ఇంటర్నేషనల్ రిలీజ్ ఉంటుంది.కలెక్షన్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది.ఆ డ్రాగన్ వచ్చినప్పుడు అన్నింటిని చుట్టేస్తది అని అన్నారు.
సో ఎన్టీఆర్ నీల్ మూవీకి కూడా టైటిల్ గా డ్రాగన్ ఉంచే ఛాన్స్ ఎక్కువగా ఉంది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 తో బిజీగా వున్నాడు.ఈసినిమా పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది జనవరి 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: