డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.గత కొన్ని రోజుల నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుంది.ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.సినిమా కూడా బాగా వస్తుందని టాక్.జూన్ లేదా జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సినిమాను దసరా బరిలో నిలుపాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా కోసం రామ్ ఓ సాంగ్ కూడా రాస్తున్నాడు.ఇప్పటికే నాలుగు పాటలు కంపోజింగ్ పూర్తిచేసుకోగా 5వ సాంగ్ ను రామ్ రాస్తున్నాడు.ఇది లవ్ సాంగ్ అని సమాచారం.మిస్ శెట్టి మిస్టర్ శెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.త్వరలోనే ఈసినిమా టైటిల్ చెప్పనున్నారు.
ఇక ఈసినిమా విజయం రామ్ కు తప్పనిసరి కానుంది.రామ్ చివరి సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి.దాంతో ఈ 22వ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఆల్రెడీ సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు,టాప్ ప్రొడక్షన్ హౌస్ ,సూపర్ క్రేజ్ వున్న హీరోయిన్ ఈ కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా చేస్తున్న రామ్ కు బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























