నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుండి వస్తున్న సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ.ప్రియదర్శి,హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు.ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ సింగిల్ ప్రేమలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది.మార్చి 7న ట్రైలర్ విడుదలకానుంది.పోక్సో చట్టం నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు.
నాని ఈసినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఇది తన బ్యానర్ నుండి వస్తున్న నాలుగో సినిమా.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.పెద్దగా పోటీ లేకుండా విడుదలకావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: