వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం టీం చకచకా షూటింగ్‌ను ఫినిష్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ అందింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది చిత్రయూనిట్. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇక నిర్విరామంగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. బినేంద్ర మీనన్ కెమెరామెన్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: