క తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.గత ఏడాది దీపావళికి విడుదలైన ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ నెక్ట్ దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ముందు ప్రకటించిన డేట్ ప్రకారం ఈ రోజే రిలీజ్ కావాల్సివుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక నిన్న కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 14 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో కిరణ్ సరసన రుక్షార్ దిల్లాన్ నటించగా మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది.మ్యాగీ అనే అమ్మాయి తో లవ్ ఫెల్యూర్ తరువాత వీటన్నింటికి దూరంగా ఉంటున్న హీరో జీవితంలోకి మరో అమ్మాయి రావడం ఆతరువాత తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఇది దిల్ రుబా స్టోరీ.సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా విశ్వ కరుణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.సరిగమ సినిమాస్ తో కలిసి రవి ,రాకేష్ రెడ్డి నిర్మించారు.
ఇక కిరణ్ అబ్బవరం రీసెంట్ గానే మరో సినిమాను స్టార్ట్ చేశాడు.K రాంప్ అనే టైటిల్ తో వస్తుంది. కొత్త దర్శకుడు నాని తెరకెక్కిస్తుండగా ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. రాకేష్ దండా నిర్మిస్తున్నారు. కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ కామెడీ డ్రామా గా తెరకెక్కుతుంది.ఈఏడాది ద్వితీయార్ధం లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























