రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్

rapo 22 shooting update

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇటీవల హైదరాబాద్ లో రెండు షెడ్యూల్లు కంప్లీట్ కాగా ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో మూడో షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో ఓ సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈసినిమాను మిస్ శెట్టి మిస్టర్ శెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. ఈఏడాది చివర్లో థియేటర్లలోకి రానుంది.

ఇక కొన్నేళ్ల నుండి రామ్ కు సరైన హిట్లు పడడం లేదు.గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ తో వచ్చిన రామ్ కు ఆ సినిమా భారీ షాక్ ఇచ్చింది.దాంతో తన 22వ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఫ్యాన్స్ కూడా ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈసినిమాతో హిట్ కొట్టి రామ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.