ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలలో ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం షూటింగ్ ముగింపుకి వచ్చేసింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఇక ఇటీవలే హరి హర వీర మల్లు నుంచి ‘మాట వినాలి’ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. పెంచల్ దాస్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ అందింది.
నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. త్వరలో ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రానుందని తెలిపారు. ‘కొల్లగొట్టిందిరో’ అంటూ సాగే ఈ యుగళగీతాన్ని ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చిత్ర యూనిట్. ఇలా వరుస అప్‌డేట్స్ చిత్రంపై అంచనాలను ఇంకా పెంచేస్తున్నాయి.
కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
కాగా ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: