‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు ఇప్పుడు మరోసారి చేతులు కలిపారు. అయితే ఇది కూడా ఓ ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ‘శబ్దం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 28, 2025న తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ శబ్దం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. ‘మాయ మాయ’ అంటూ సాగే ఈ పాట సినిమాలోని మెయిన్ థీమ్‌ని చూపుతోంది.
కాగా ‘వైశాలి’లో ‘వాటర్’ హారర్ ఎలిమెంట్‌తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివళగన్.. ఈ సినిమాలో ‘సౌండ్’ ని సూపర్ నేచురల్ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు. ఇక ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటీమణులు సిమ్రాన్, లైలా మరియు రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
7G ఫిల్మ్స్ శివ తమిళ చిత్ర పరిశ్రమలో 225కి పైగా చిత్రాలను పంపిణీ చేసి ‘ద్రౌపతి, రుద్ర తాండవం’ వంటి చిత్రాలను సహ నిర్మాతగా చేయడం ద్వారా ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆయన ఇప్పుడు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటివరకు ఆది కెరీర్‌లో మొదటి భారీ బడ్జెట్ చిత్రంగా నిలువనుంది.
ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది, ప్రేక్షకులకు ‘హారర్’ స్టయిల్ లో కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు, ఈ సినిమా ‘సౌండ్’ ఆధారంగా రూపొందినందున, ఈ చిత్రానికి అవుట్ స్టాండింగ్ ఆడియోగ్రఫీని టి. ఉదయ్ కుమార్ సమకూర్చారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులుతుది దశకు చేరుకున్నాయి. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. ఇక ఈ చిత్రం N సినిమాస్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: